తారామ‌తి రిసార్ట్ డ్ర‌గ్స్ కేసు..అప్‌డేట్

7
- Advertisement -

హైదరాబాద్‌లోని తారామతి సమీపంలో జరిగిన భారీ డ్రగ్ పార్టీని పోలీసులు ఛేదించారు. ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో శనివారం అర్ధరాత్రి నిర్వహించిన ఈ ఈవెంట్‌పై ఈగల్ టాస్క్‌ఫోర్స్, హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, గోల్కొండ పోలీసులు సంయుక్తంగా దాడులు చేపట్టారు.

ఈ రిసార్ట్‌లో జరిగిన పార్టీకి దాదాపు 300 మంది హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారంతో అకస్మికంగా దాడి చేసిన అధికారులు అనుమానాస్పదంగా ఉన్న 35 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో బాలీవుడ్ నటుడు అబ్దుల్ సర్వర్‌తో పాటు అభినాశ్ ఫణి, యోగేశ్వర్, బ్రెట్ జాసన్, నిహార్-ఆషి అనే దంపతులు ఉన్నట్లు వెల్లడించారు. వీరు గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాలు వినియోగించినట్లు నిర్ధారించారు.

డీజే జాసన్ సూచనతో ఈ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబయి వంటి నగరాల నుంచి యువత, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరైనట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్, నిర్వాహకులు, మాస్టర్‌మైండ్ ఎవరన్న దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Also Read;అరుణాచల్ సీఎంపై సీబీఐ దర్యాప్తు

- Advertisement -