సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు, ఇంటర్నెంట్ మీడియా ప్రాభల్యం పెరిగిపోతూడటం స్టార్స్ కు తలనొప్పిగా మారింది. తమ అభిమాన హీరోల చిత్రాలకు తామే టైటిల్స్ అనుకుని వాటని ప్రచారం చేయటం, పోస్టర్స్ డిజైన్ చేసి ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ లో పెట్టడం ఇబ్బందిగా మారుతోంది. నిన్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి ఆటోజాని అంటూ విస్తృత ప్రచరాం చేస్తూ ఫోటోని షేర్ చేశారు.
ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఆసక్తికర ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత మురుగదాస్‌తో భారీ ప్రాజెక్టు చేస్తున్న మహేష్ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క ఫోటోకూడా బయటకు రాలేదు. దీంతో మహేష్ ఇమేజ్‌ను ఉహించుకుంటు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు. తాజాగా మహేష్‌కు సంబంధించి షేర్ చేసిన పోస్టర్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.
మహేష్ 23 అంటూ ఓ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ వైరలైంది. మహేష్ గాల్లో ఎగురుతున్నట్లుగా ఉండే ఈ పోజ్ చూసి చాలామంది అభిమానులు తెగ ఉత్సాహపడ్డారు. అయితే, ఈ ఫోటో కాపీ కొట్టారని తెల్సి కాస్త నిరాశచెందిన ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండవుతోంది. 2014లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ బ్రిక్ మాన్షన్స్ నుంచి ఈ ఫోటోను కాపీ చేశారంతే. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీగా తెరకెక్కిన ఆ మూవీలో.. డేవిడ్ బెల్లె జంపిగ్ సీన్ కు.. మహేష్ ఫేస్ ను మార్ఫింగ్ చేశారు. ఫేక్ పోస్టరైన మహేష్ లుక్‌ని చూసి అభిమానులు తెగసంబరపడిపోతున్నారు.