విక్రమ్ తో రీతూ వర్మ…

212
Ritu Varma in Vikram's Dhruva Natchathiram
- Advertisement -

రీతూ వర్మ ‘పెళ్లి చూపులు’ సినిమా విజయంతో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నా , రీతూ వర్మ మాత్రం తనకి నచ్చిన పాత్రలకి ఓకే చెబుతూ వెళుతోంది. ఆమె ఒక తమిళ సినిమా కూడా తాజాగా ఓకే చెప్పేసింది. ఈ సినిమాకి దర్శకుడు గౌతమ్ మీనన్ కాగా హీరో విక్రమ్ కావడం విశేషం.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా సినిమా తెరకెక్కుతోంది. దీనికి ‘ధ్రువ నచ్చత్తిరం’ అనే పేరు పరిశీలనలో వుంది. ఆల్రెడీ ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలోముందుగా కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకున్నారు. అయితే ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.దాంతో రీతూ వర్మను ఎంపిక చేసుకున్నారట.

ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొనడం కావడం కూడా జరిగిందాట.విక్రమ్ సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా చేయడం ఈ ముద్దుగుమ్మకి బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే.. ఈ సినిమా కోలీవుడ్ నుంచి ఆమెకి మరిన్ని అవకాశాలు తెస్తుందేమో వేచి చూడాలి.

- Advertisement -