ఇక నుంచి ఈ యాప్‌ల పేర్లు మారనున్నాయి..!

423
Facebook
- Advertisement -

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌, ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ల పేర్లు మారనున్నాయి. వీటి పేర్లను మార్చాలని ఫేస్‌బుక్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇవి ఫేస్‌బుక్ నుంచి వచ్చినప్పటికీ వీటికంటూ స్వతంత్రత ఉంది. గత ఏడాది కాలంగా ఫేస్‌బుక్‌ వీటికి ఆ స్వతంత్రతను తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా వాటి పేర్లు మార్చేందుకు ప్రయత్నిస్తోంది.

whatsapp

దీంతో ఇకపై వాట్సాప్‌కు బదులుగా వాట్సాప్ ఫ్రమ్ ఫేస్‌బుక్ అని, ఇన్‌స్టాగ్రాంకు బదులుగా ఇన్‌స్టాగ్రాం ఫ్రమ్ ఫేస్‌బుక్ అని మనకు పేర్లు కనిపించనున్నాయి. అలాగే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్, వెబ్‌సైట్లలోనూ మనకు త్వరలో మారిన పేర్లే దర్శనమివ్వనున్నాయి.ఇన్‌స్టాగ్రామ్‌ 2012లో ప్రారంభించగా, వాట్సప్‌ 2014లో వినియోగంలోకి వచ్చింది.

- Advertisement -