రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ భారీ పెట్టుబడి

270
jio
- Advertisement -

భారత టెలికం దిగ్గజ కంపెనీ, రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టింది ఫేస్ బుక్. రూ.43,574 కోట్లు అంటే 9.99 శాతం వాటాను సొంతం చేసుకుంది ఫేస్ బుక్. ఫేస్ బుక్ ను సాదరంగా జియోలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు రిలయన్స్ సీఎండీ ముఖేష్ అంబానీ. ప్రధాని నరేంద్ర మోడీ మదిలోని డిజిటల్ ఇండియా మిషన్ ఆలోచన కూడా త్వరగా లక్ష్యాన్ని అందుకుంటుంది. కరోనా తరువాత, ఇండియా ఆర్థిక వృద్ధి శరవేగంగా పెరుగుతుందని నమ్మకంతో ఉన్నానని తెలిపారు.

ఫేస్ బుక్‌తో ఒప్పందం ద్వారా భారత్‌లో వాణిజ్యం మరింత మెరుగవుతుందన్నారు. వినియోగదారులకు ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, స్మార్ట్ డివైజ్ లు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), బ్లాక్ చెయిన్, అగుమెంటెడ్ అండ్ మిక్సెడ్ రియాల్టీ సేవలను మరింత దగ్గర చేయవచ్చని అభిప్రాయపడింది.

ఫేస్ బుక్ పెట్టుబడి తరువాత జియో ప్లాట్ ఫామ్స్ విలువ రూ. 4.62 లక్షల కోట్లకు పెరిగింది. దేశవ్యాప్తంగా 38.8 కోట్ల మంది వినియోగదారులకు టెలికం సేవలను అందిస్తున్న జియో ఇన్ఫోకామ్, ఈ డీల్ తరువాత కూడా జియో ప్లాట్ ఫామ్ అనుబంధ సంస్థగానే కొనసాగుతుందని రిలయన్స్ స్పష్టం చేసింది.

- Advertisement -