ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య వేలసంఖ్యలో ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చేస్తూ ముందుకు సాగుతోంది టీటీడీ. ఇందులో భాగంగా తాజాగా ఫేస్ రికగ్నేషన్ యాప్‌ని తీసుకురానుంది.
మార్చి ఒకటి నుంచి ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా నివారించేందుకు అలాగే వసతి గదుల కేటాయింపు కేంద్రాల దగ్గర,కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
ఈ నిర్ణయంతో పారదర్శకత మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ టెక్నాలజీని ప్రయోగాత్మంగా పరిశీలించి.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమలుపై నిర్ణయం తీసుకోబోతున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.
ఇవి కూడా చదవండి..