నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా తెరెకెక్కుతోన్న ఈమూవీ మొదటి భాగం కథనాయకుడు జనవరి 7న విడుదల చేయనున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని బాలకృష్ణ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు.
ఈచిత్రం తర్వాత బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడు. ఈమూవీని ఫిబ్రవరిలో సెట్స్ పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమూవీ తర్వాత బాలకృష్ణ వివి. వినాయక్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా ఉన్న సమాచారం ప్రకారం బోయపాటి తర్వాత అనిల్ రావిపూడితో మూవీ చేయనున్నాడని సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్ , వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఎఫ్ 2 అనే మల్టీస్టారర్ లో బిజీగా ఉన్నాడు. ఈమూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. గత కొన్ని రోజులుగా బాలకృష్ణతో చర్చిస్తున్నానని, బహుశా బోయపాటి శ్రీను చిత్రం తర్వాత బాలకృష్ణతో నా మూవీ ఉండవచ్చన్నారు అనిల్ రావిపూడి.