కంటి చూపును మెరుగుపరిచే.. సూపర్ చిట్కా !

48
- Advertisement -

నేటి రోజుల్లో కంటి చూపు సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపించేది. కానీ నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారిలోనైనా చూపు మందగించే సమస్య పెరిగిపోతుంది. దాంతో చిన్న పిల్లలు కూడా కళ్ళద్దాలు వాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా చాలమందిలో కంటి చూపు సమస్యలు పెరిగిపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటు, గంటల తరబడి మొబైల్, టీవి వంటివి చూడడం కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు గడపడం.. ఇలా చాలా కారణాల వల్ల చూపు మందగించడం జరుగుతుంది. దాంతో కంటిచూపును మెరుగుపరచుకునేందుకు ఎన్నో మెడిసన్స్ వాడుతూ ఉంటారు. అయితే మన ఇంట్లో దొరికే కొన్నిటి ద్వారా సులభంగా కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు. కంటి చూపును మెరుగుపరచడంలో ఆకు కూరలు ప్రధాన పాత్ర పోషిస్తాయని మనందరికి తెలుసు.. ఎందుకంటే ఆకుకూరాలలో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది. కంటి చూపును పెంచడంలో ఏ విటమిన్ ఎంతగానో సహాయపడుతుంది. ఇక కంటిచూపును మెరుగుపరచడంలో ఆయుర్వేద నిపుణులు చెబుతున్నా అద్బుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం.!

కంటి చూపు తక్కువగా ఉన్నవాళ్ళు 5 నుంచి 6 మిరియాలు తీసుకొని వాటిని పొడి చేసుకొని ఒక గిన్నె లోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో అర టి స్పూన్ పటిక బెల్లపు పొడిని, ఒక టి స్పూన్ స్వచ్చమైన ఆవు నెయ్యిని వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ప్రటోరోజు ఉదయాన్నే పడగడుపున తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని నిల్వ చేసుకోకుండా.. ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకొని సేవిస్తే కంటిచూపు మెరుగుపడడంలో చక్కటి ఫలితాలు కనిపిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇక ఈ చిట్కా పాటిస్తూనే మంచి పోషక విలువలు ఉన్న క్యారెట్, గుడ్లు, చిలగడ దుంపలు, చేపలు, పాల పదార్థాలు వంటివి తీసుకుంటే కంటి చూపు పరంగా అద్భుతమైన ఫలితాలు చూడవచ్చని చెపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -