బ్యాట్‌మ్యాన్‌…ది ఫ్లాష్‌ ట్రైలర్ విడుదల

36
- Advertisement -

హాలీవుడ్‌లో 1989లో వచ్చిన బ్యాట్‌మ్యాన్‌ సినిమా మీలో ఎంతమందికి గుర్తు ఉంది. అవును మళ్లీ తెరపైకి బ్యాట్‌మ్యాన్‌ రానున్నారు. 1989లో వచ్చిన బ్యాట్‌మ్యాన్ హీరో మైఖేల్ కీటన్‌ ది ఫ్లాష్ అనే సినిమాతో సందడి చేయనున్నారు. వార్నర్ బ్రదర్స్‌ నిర్మించిన ఈ సినిమాలో ఎజ్రామిల్లర్ ఫ్లాష్, బెన్‌ అప్లెక్‌, సాషా కాల్, మైఖేల్‌ కీటన్,కెయిర్స్ క్లెమోన్స్‌ ప్రధాన పాత్రలో నటించారు.

ఈ సినిమాను ఆండీ ముషియెట్టి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉండే కానీ కరోనా కారణంగా ఈ సినిమాను వాయిదా వేసుకంటూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమాను ఈ యేడాది జూన్‌16న విడుదలకు సిద్దం చేయనున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను ట్వీట్టర్‌లో విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి…

‘ఎన్టీఆర్ 30’కి ముహూర్తం ఖరారు

మహేష్ కి విలన్ ఎవరంటే?

బాలయ్యతో మరోసారి !

- Advertisement -