Sjaishankar:బర్గర్‌ స్థానంలో పానీపూరీ.. ప్రవాసుల ప్రశ్న.!

45
- Advertisement -

భారత విదేశాంగ విధానంలో భారత్ కీలకమైన అడుగులు వేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఫారిన్ సర్వీసెస్ అధికారిని మంత్రిగా నియమించిన తర్వాత విదేశాంగ విధానంలో దూకుడు స్వభావం పెరిగింది. తాజాగా భారతవిదేశాంగ మంత్రి ఈయూ ఇండో-పసిఫిక్ మంత్రిత్వస్థాయి సదస్సుకు హాజరయ్యారు. స్వీడన్‌లో జరుగుతున్న సదస్సులో భాగంగా ప్రవాసభారతీయులతో ఇంటారక్ట్‌ అయ్యారు.

ఈ సందర్భంగా ప్రవాసభారతీయుడు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇంతకి ప్రశ్న ఎంటంటే…పాశ్చాత్య దేశాలు హాంబర్గర్‌కు బదులుగా పానీపూరీ తినే రోజులు వస్తాయా ? న్యూయార్క్‌ అనే పేరుకు బదులుగా న్యూ ఢిల్లీ అనే ఫ్రింట్ ఉండే టీషర్టులను చూస్తామా? అని అడిగారు. దీనికి సమాధానం చెబుతూ…మీరు చెప్పినవన్నీ త్వరలో నిజమవ్వాలని ఆశిద్దాం. అదే జరిగితే మీ నోరు తీపిచేస్తాను అని చెప్పారు. దీంతో అక్కడ ఉన్నవారందరూ కరతాళ ద్వనుల మధ్య జైశంకర్ సమాధానంను స్వాగతించారు.

Also Read: సిద్దరామయ్య వైపే మొగ్గు.. డీకేను దెబ్బతీసిందదే!

భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం మనం ఇప్పుడిప్పుడే చూడటం మొదలు పెట్టాము. ఇందుకు చాలా కారణాలున్నాయి. ఒకటి ప్రవాసభారతీయులు విశ్వమంతా ఉండటం. రెండోది మన ఆత్మవిశ్వాసం పెరగడం. అని బదులిచ్చారు. 2015లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ తర్వాతి కాలంలో ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పుడు యోగాపై ఉత్సాహం చూపించని దేశమే లేదంటే నమ్మగలరా అని ఆయన వివరించుకొచ్చారు.

Also Read: కాంగ్రెస్ పాపం…పాలమూరుకు శాపం

- Advertisement -