ఎయిర్‌పోర్ట్ స్కిన్ ఎందుకు వస్తుంది? దాన్ని నివారించడానికి ఏం చేయాలి? అలాగే విమానంలో చాలా మంది ఇష్టపడే ‘విండో సీట్’ వల్ల చర్మానికి జరిగే నష్టాలేంటో తెలుసుకుందాం. మీరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు సుదీర్ఘ సెక్యూరిటీ చెకింగ్‌లు, క్యాబిన్‌లోని పొడి గాలి, కిక్కిరిసిన టెర్మినల్స్, ఫ్లైట్ ఆలస్యం కావడం, గంటల తరబడి ఏసీలో ఉండటం మరియు నిద్రలేమి వంటి అనేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నింటి ఫలితంగా మీరు ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వచ్చేసరికి మీ చర్మం పొడిగా, డీహైడ్రేట్ అయినట్లు కనిపిస్తుంది. ప్రయాణం తర్వాత చర్మం ఇలా కాంతిహీనంగా మారడాన్ని ఎయిర్‌పోర్ట్ స్కిన్ అని పిలుస్తారు.
ఇది మీ ఎయిర్‌పోర్ట్ లుక్‌ను పాడు చేయడమే కాకుండా చర్మాన్ని గరుకుగా, బిగుతుగా మార్చి అసౌకర్యానికి గురిచేస్తుంది. ఎయిర్‌పోర్ట్ స్కిన్ రావడానికి ప్రధాన కారణాలు….విమానం లోపల ఉండే వాతావరణం చర్మానికి అంత అనుకూలంగా ఉండదు. సాధారణంగా విమాన క్యాబిన్లలో తేమ శాతం కేవలం 10 నుండి 20 శాతం మాత్రమే ఉంటుంది. ఇది చర్మానికి చాలా తక్కువ. దీనివల్ల చర్మంపై పొట్టు రాలడం, బిగుతుగా మారడం వంటి డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయి.
ఫ్లైట్లు ఆలస్యం కావడం, నిద్ర లేకపోవడం, జెట్ లాగ్ వంటి కారణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో ‘కోర్టిసోల్’ హార్మోన్ స్థాయిలు పెరిగి చర్మంపై మొటిమలు రావడం, సెబమ్ (జిడ్డు) ఉత్పత్తి పెరిగి చర్మం పొడిగా, జీవం లేనట్లు కనిపిస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ కోసం వేచి చూసే సమయంలో చాలా మంది కాఫీలు తాగుతుంటారు. అయితే కాఫీ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కాఫీ తాగడం వల్ల చర్మం మరింత పొడిబారుతుంది.
ఎయిర్‌పోర్ట్ వాతావరణం వల్ల చర్మం తన పైపొర నుండి ఎక్కువ మొత్తంలో నీటిని కోల్పోతుంది. దీనివల్ల చర్మ రక్షణ పొర దెబ్బతిని ముఖం అలసిపోయినట్లు కనిపిస్తుంది.కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. ప్రయాణానికి కొన్ని రోజుల ముందు నుంచే తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అయితే ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు.
చర్మ రక్షణ పొరను బలోపేతం చేసే హైలురోనిక్ యాసిడ్ , సిరమైడ్స్ , గ్లిజరిన్ లేదా స్క్వాలేన్ వంటి పదార్థాలు ఉన్న మాయిశ్చరైజర్‌ను రాయాలి. ముఖ్యంగా ఉదయం పూట విమాన ప్రయాణాలు చేసేటప్పుడు బ్రాడ్-స్పెక్ట్రమ్ ఎస్పీఎఫ్ (SPF) ఉన్న సన్‌స్క్రీన్ రాసుకోవడం అస్సలు మరువకూడదు. ఇది యూవీ కిరణాల నుండి రక్షణ ఇస్తుంది. ప్రయాణానికి ముందు చర్మాన్ని ఎక్కువగా ఎక్స్‌ఫోలియేట్ చేయడం (స్క్రబ్బింగ్) లేదా ఘాటైన కెమికల్స్ వాడటం చేయకూడదు. క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్, సన్‌స్క్రీన్ మాత్రమే సరిపోతాయి.
Also Read:సుప్రీంకు మీనాక్షి నటరాజన్
విమానంలో పెదవులు, కళ్ల కింద భాగం త్వరగా పొడిబారుతాయి. కాబట్టి మంచి హైడ్రేటింగ్ లిప్ బామ్ మరియు సువాసనలు లేని ఫేషియల్ మిస్ట్ వాడటం మంచిది.ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే. చర్మ సమస్యల కోసం ఎల్లప్పుడూ నిపుణులైన వైద్యులను సంప్రదించండి.

