పొన్నాల‌కు ద‌క్క‌ని జ‌న‌గామ టికెట్..

245
ponnala
- Advertisement -

నిన్న అర్ధ‌రాత్రి కాంగ్రెస్ అధిష్టానం ప్ర‌క‌టించిన మొద‌టి లిస్ట్ లో మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల ల‌క్ష్మ‌య్య‌కు చోటు ద‌క్క‌లేదు. దింతో విష‌యం తెలుసుకున్న పొన్నాల హుటాహుటిన హ‌స్తిన‌కు ప‌య‌న‌మ‌య్యారు. నేడు ఏఐసిసి అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో ఆయ‌న స‌మావేశ‌మ‌వ్వ‌నున్నారు. గ‌తంలో పీసీసీ చీఫ్ గా ఉన్న త‌న‌కే సీటు ఇవ్వ‌క‌పోవ‌డంతో రాష్ట్ర నేత‌ల‌పై ఆగ్ర‌హంగా ఉన్నారు పొన్నాల‌.

ponnala kodandaram

మ‌హాకూట‌మిలో భాగంగా జ‌న‌గామ సీటు ఆసిస్తున్న టీజేఎస్ అధ్యక్షుడు కొదండ‌రాంకు ఆ స్ధానాన్ని కేటాయించిన‌ట్టు స‌మాచారం. కొదండ‌రాంకు జ‌న‌గామ సీటు కేటాయిస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై పొన్నాల వ‌ర్గం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న చేతుల‌మీదుగా బీ ఫార‌మ్ లు ఇచ్చిన వ్య‌క్తి కి ఇప్పుడు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు.

uttam ponnala

కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పక్కన పెట్టాలని ఎందుకు భావిస్తోందో తెలియడం లేదని వాపోయారు. కాగా పొన్నాల ల‌క్ష్మ‌య్య మ‌రికొద్ది సేప‌ట్లో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని క‌లవ‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతో పొన్నాలను బుజ్జ‌గించే ప‌నిలో ఉన్నారు ఢిల్లీ పెద్ద‌లు. వ‌చ్చే ఏడాదిలో జ‌రుగనున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరి నుంచి టికెట్ ఇస్తామ‌ని పొన్నాల‌కు హామి ఇచ్చినట్టు తెలుస్తుంది. కూట‌మికి ఆజ్యం పోసిన వ్య‌క్తికే టికెట్ రావ‌పోవ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు.

- Advertisement -