సిద్దిపేట పట్టణంలోని రూ.20కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సమీకృత మోడల్ మార్కెట్ ను జిల్లా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు కలెక్టర్ క్రిష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకార్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, వైస్ ఛైర్మన్ అక్తర్ పటేల్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేముల వెంకట్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ సిద్ధిపేట పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు, వినియోగదారులకు అన్నీ రకాల కూరగాయలు, పండ్లు, పూలు, చేపలు, మాంసం.. ఇలా అన్నీ ఒకే చోట లభించేలా ఈమార్కెట్ యార్డును ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే నా లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి మోడల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మన సిద్ధిపేటలోనే ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి అత్యాధునిక వసతులతో కూడిన మోడ్రన్ మార్కెట్ దేశంలోనే ఎక్కడా లేదన్నారు.
ప్రజలకు బతుకుదెరువు ఇవ్వడంతో పాటు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మోడల్ రైతు బజారులో రోజుకు 600 మంది రైతులు కూరగాయలు అమ్మనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రైతు బజారులో రోజున 9 నుంచి 10లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు. ప్రజలకు శుభ్రమైన మాంసం, కూరగాయలు, పండ్లు ప్రజలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వినియోగంలోకి తెచ్చి ఆదర్శంగా నిలుపడం గొప్పతనమని., ఆచరణలో పెడితే చాలా గొప్ప అంటూ.. ఆ సహకారం మీరంతా ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజలను కోరారు.