- Advertisement -
తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి పల్లంరాజు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల పల్లంరాజు మీడియాతో మాట్లాడుతూ… వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోడానికి మొట్టమొదటి సారి అవకాశం దక్కిందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. కరోనా ప్రోటోకాల్ తప్పనిసరిగా ప్రజలు పాటించాలని కోరారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉందన్నారు. చైనా వైపు నుంచి విపత్తు పొంచి ఉంది… దీన్ని త్వరిత గతిన పరిష్కరించకపోతే పెనుప్రమాదం తప్పదని పేర్కొనారు.
- Advertisement -