కొత్త పార్టీ పెట్టనున్న మాజీ సీఎం అమరీందర్ సింగ్

132
amarinder
- Advertisement -

త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో విభేదాల కారణంగా సీఎం పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం, కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంతపార్టీపై క్లారిటీ ఇచ్చేశారు.

త్వరలో పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించిన ఆయన బీజేపీతో పొత్తు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం పార్టీ ఏర్పాటుపై అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థక్రల్ ట్వీట్‌ చేయడం హాట్‌ టాపిగ్గా మారింది.

79 ఏళ్ల అమరీందర్ సింగ్.. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అయితే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను సిద్ధూకు అప్పగించడంపై కెప్టెన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే సొంతపార్టీ ఏర్పాటుకు మొగ్గుచూపారు.

- Advertisement -