కాంగ్రెస్,బీజేపీలను ఊడ్చేసిన ఆప్‌..

130
aap
- Advertisement -

ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగానే పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, బీజేపీలను ఊడ్చేసి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆప్ గెలుపుతో ఆ పార్టీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి.

117 స్థానాలు ఉన్న పంజాబ్‌లో ఆప్ స‌ర్కార్ ఖాయ‌మైంది. తాజా రిపోర్ట్ ప్ర‌కారం 88 స్థానాల్లో ఆమ్ ఆద్మీ లీడింగ్‌లో ఉంది. అధికార కాంగ్రెస్ కేవలం 13 స్ధానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఏంది. ఆ రాష్ట్రంలో హేమాహేమీలు దారుణంగా విఫ‌ల‌మైన‌ట్లు తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. లంబీ స్థానం నుంచి పోటీ చేసిన ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ వెనుకంజ‌లో ఉన్నారు. శిరోమ‌నీ అకాలీద‌ళ్ నేత గ‌నివీ కౌర్ మంజిత లీడింగ్‌లో ఉన్నారు. పాటియాలా అర్బ‌న్ నుంచి పోటీ చేసిన పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ వెనుకంజ‌లో ఉన్నారు.

- Advertisement -