చికెన్, గుడ్లు తినండిః సీఎం కేసీఆర్

211
kcr
- Advertisement -

చికెన్, గుడ్లు తిన‌డం వ‌ల్ల క‌రోనా వైర‌స్ వ‌స్తుంద‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని కానీ చికెన్, గుడ్లు తిన‌డం వ‌ల్లే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌న్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యారోగ్య శాఖ అధికారులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కరోనా నియంత్రణకు శారీరక ధారుఢ్యంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. చికెన్ తినొద్దని కొందరు దుర్మార్గులు చేసే ప్రచారాన్ని న‌మ్మోద్దు. కొంత మంది వెద‌వ‌లు కావాల‌ని ఇలా ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు.

రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సీ విటమిన్‌ ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్న‌ట్లు తెలిపారు. చికెన్ తో పాటు నిమ్మ‌, బ‌త్తాయి, సంత్రాలు, దానిమ్మ పండ్లు రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుతాయ‌ని చెప్పారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను ఎట్టి ప‌రిస్ధితుల్లో అడ్డుకోవ‌ద్ద‌ని పోలీసుల‌ను కోరారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందే వ‌ర‌కు ప్ర‌జ‌లు స్వీయ నిర్భందంలోనే ఉండాల‌ని తెలిపారు.

- Advertisement -