తెలుగు రాష్ట్రాల‌కు రూ.20ల‌క్ష‌లు విరాళం ఇచ్చిన త్రివిక్ర‌మ్

225
Trivikram
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలో కరోనా సహాయక చర్యల కోసం తెలుగు రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ‌విరాళం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.10 లక్షల చొప్పున విరాళం అందజేస్తానని వెల్లడించారు. ఈ విరాళాలను ప్రభుత్వాలకు త్వరలోనే అందచేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు మేరకు ఒక ప్రకటన విడుద‌ల‌ చేశారు.

- Advertisement -