గల్ప్ సమస్యలను తెలంగాణ ఏన్నారై మంత్రి కెటి రామారావు గారి దృష్టికి తీసుకుపోయేందుకు మంత్రిని ఈ రోజు హైదరాబాద్ లో ఏమిరెట్స్ తెలంగాణ కల్చరల్ అసోషియేషన్ సంఘం కలిసింది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏన్నారైల సమస్యల పట్ల సానూకూలంగా స్పందిస్తున్న తీరుపైన దన్యవాదాలు తెలియజేసింది. తెలంగాణ గల్ప్ ఏన్నారైలకు పలు సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారాసైతం మంత్రి అందుబాటులో ఉండడం పట్ల ఈటిసియే హర్షం వ్యక్తం చేసింది. మంత్రిని ఏ అర్థరాత్రి అయినా సరే సోషల్ మీడియా ద్వారా చేరుకునే అవకాశం ఉండడం గల్ ప్రవాసీయులకు భరోసా ఇస్తుందని సంఘం అధ్యక్షులు కిరణ్ కూమార్ పీచర తెలిపారు. ఈ మేరకు తెలంగాణ గల్స్ ప్రవాసీయుల కష్టాలను, సమస్యలు, పరిష్కారాలతో కూడిన ఒక నివేధికను సంఘం ప్రతినిధులు మంత్రికి అందజేశారు.
తమ ప్రభుత్వం గల్ప్ కష్టాలను పూర్తి అర్ధం చేసుకుంటున్నదని, త్వరలోనే పలు అంశాలపైన ప్రకటన చేస్తామని మంత్రి ప్రతినిధులకు తెలిపారు. మ్యానిఫెస్టోలో ప్రవాస భారతీయుల సమస్యలపైన ఇచ్చిన హమీలను అమలు చేసే దిశగా ముందుకు పోతున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సంఘం ప్రతినిధులతో మాట్లాడుతు గల్ప్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితులుపైన వాకబు చేశారు. త్వరలోనే తానే స్వయంగా గల్ప్ ప్రాంతంలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈమేరకు గల్ప్ సంఘాలకు, ఏన్నారైలకు పూర్తి స్థాయిలో సహయ, సహకారాలుంటాయని మంత్రి భరోసా ఇచ్చారు. ఏ సమస్య ఉన్నా తన కార్యాలయ సిబ్బందికి తెలియజేయాలని ఈటిసిఏ ప్రతినిధులకు మంత్రి తెలిపారు.