రాజ్ భవన్‌లో ఉగాది వేడుకలు..

109

హైదరాబాదులోని రాజ్ భవన్ వేదికగా ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హేమలంబ నామసంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ దంపతులతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.

kttr

 హేవలంబి నామ సంవత్సరంలో అందరూ బాగుండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర ప్రజలందరికీ హేవలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతీ యేటా గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నరని సీఎం అన్నారు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు నాయిని, కేటీఆర్, చందూలాల్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.