- Advertisement -
దిగ్గజ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర రావు మృతి పాత్రికేయ రంగానికే కాదు సమాజానికి తీరనిలోటు అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి…ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియచేశారు.
గుంటూరు జిల్లా పొత్తూరు లో పుట్టినప్పటికీ తెలంగాణ పోరాటానికి మద్దతుగా నిలిచిన పొత్తూరి వెంకటేశ్వర రావు మృతి తనను కలచివేసిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేశారు గుర్తుచేశారు.
విలువలు కలిగిన జర్నలిజానికి ఆయన నిజమైన ప్రతినిధి అని…. మానవీయతకు ఆయన నిలువెత్తు నిదర్శనం అన్నారు. పాత్రికేయ వృత్తిని అత్యంత బాధ్యతతో, సామాజిక హితానికి, చైతన్యానికి వాడిన నిఖార్సైన జర్నలిస్టు అన్నారు. పొత్తూరి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.
- Advertisement -