- Advertisement -
శ్రీరాముడు తన జీవితమంతా ధర్మం కోసం నిలబడ్డాడని,అందుకే ఆయన ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అందువల్ల రామాయణం నిత్య పారాయణ కావ్యంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ప్రపంచానికి ఆదర్శప్రాయులన్నారు. శ్రీరామ నవమిని ప్రజలు భక్తి, శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ సీతా రాముల కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.
- Advertisement -