వలస కూలీలను కూడా మనలో ఒకరిగా గౌరవించాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహాబుబబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునగలవీడు గ్రామ పంచాయతీని పరిశీలించిన మంత్రి…మునగలవీడు పంచాయతీలో మొక్కల పెంపకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ నిర్వహణపై పలు సూచనలు చేశారు.
బొజ్జన్నపేటలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన మంత్రి దయాకర్ రావు, వారికి కూలీ ఎంత పడుతుందని అడిగి తెలుసుకున్నారు. రోజుకు కూలీ కనీసం రూ.200 పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కరోనా నేపథ్యంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, లేకపోతే చేతిరుమాలు, కండువాలు ముఖాలకు ముసుగుగా ధరించాలని చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ, పనులు చేయాలని, పనులు చేసే చోట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వసల కూలీలతో విస్తరించే అవకాశాలున్నాయని, ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.