ప్రతిపక్షాల ట్రాప్‌లో ఆర్టీసీ కార్మికులు: ఎర్రబెల్లి

461
dayakar rao
- Advertisement -

ఆర్టీసీ కార్మికులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడ్డారని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన ఎర్రబెల్లి తానెప్పుడు ఉద్యోగులను ఒక్కమాట అనలేదని కానీ వారు తనను తెలంగాణ ద్రోహి అనడం ఎంతవరకు సబబు అన్నారు. తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన వ్యక్తిని తానని చెప్పారు.

చంద్రబాబును బెదిరించి తెలంగాణ కోసం లెటర్ అడిగాను అప్పుడు చంద్రబాబు ఎదిరించానని ఈ విషయం అందరికి తెలుసన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక పక్షపాత ప్రభుత్వం అన్నారు. తనపై కార్మికులు చేసిన ఆరోపణలను వెనుక్కి తీసుకోవాలని కోరారు.

బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు అనవసర ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులను తప్పుదోవలో నడిపిస్తున్నారని చెప్పారు. కార్మికులు చెప్పిన అన్ని డిమాండ్లకు సానుకూలంగా ఉన్నామని ఒక్క విలీనం మాత్రం సాధ్యంకాదని చెబుతున్నామని తెలిపారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని పెట్టలేదని రైతు బంధు, ఆసరా పెన్షన్ పథకాలను మ్యానిఫెస్టోలో పెట్టాం అమలు చేశామని చెప్పారు. కార్మికులు చర్చలకు వస్తే బాగుండేదన్నారు.

- Advertisement -