సీఎం జనగామ పర్యటన..ఎర్రబెల్లి సమావేశం

46
errabelli

ఈ నెల 20న జనగామలో సీఎం కేసిఆర్ పర్యటన ఏర్పాట్లపై సమావేశమయ్యారు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్..ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రగతి పనులను పరుగెత్తించేందుకు ఈ నెల 20వ తేదీన జ‌న‌గామ జిల్లాలో పర్య‌టించి సంక్షేమ, అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌నున్న సంద‌ర్భంగా నేడు హైద‌రాబాద్ మంత్రుల నివాస ప్రాంగ‌ణంలోని రాష్ట్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి శ్రీ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారి క్వార్ట‌ర్ లో రాష్ట్ర గిరిజ‌న‌, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి శ్రీమ‌తి స‌త్య‌వ‌తి రాథోడ్, రాష్ట్ర రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షులు, ఎమ్మెల్సీ శ్రీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి, పూర్వ ఉప ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్సీ శ్రీ క‌డియం శ్రీహ‌రి, ఎమ్మెల్సీ శ్రీ పోచంప‌ల్లి శ్రీనివాస‌రెడ్డి, తొలి ఉప ముఖ్య‌మంత్రి, స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే శ్రీ తాటికొండ రాజ‌య్య‌, జ‌న‌గామ జ‌డ్పీ చైర్మ‌న్ పాగాల సంప‌త్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీ బొడేకుంటి వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎడవెల్లి కృష్ణ రెడ్డి,జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి, ఇతర నాయకులు సంపత్, రాజేశ్వర్ రెడ్డి, స‌మావేశ‌మ‌య్యారు.

ముఖ్య‌మంత్రి శ్రీ కేసిఆర్ గారి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చేపట్టే సంక్షేమ‌, అభివృద్ధి, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. అన్ని ప‌నులు స‌మ‌న్వ‌యంతో చేయాల‌ని, ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్తలు తీసుకోవాల‌న్నారు. జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి పనులు వాటి కార్యాచ‌ర‌ణ‌, ప్ర‌స్తుతం సిఎంగారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాల‌ను సిద్ధం చేయాల‌న్నారు. ముఖ్యమంత్రి సభ కోసం మండలాల వారీగా ఇంచార్జీలకు బాధ్యత అప్పగించారు. సభా స్థలాన్ని మండలాల ఇంఛార్జిలతో కలిసి పరిశీలిస్తారు.