ఫలించిన తుమ్మల నాగేశ్వరరావు కృషి..రైతుల కళ్లల్లో ఆనందం

82
tummala
- Advertisement -

సూర్యాపేట నుండి దేవరపల్లివరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి,నిర్మాణంలో విలువైన భూముల కోల్పోతున్న రైతులు ఇటీవల కాలంలో మాజీమంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావుని కలిసి భూములకు సరైన నష్టపరిహారం గురించీతమ గోడును వెళ్ళబుచ్చారు….

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం రైతులకు సరైన నష్టపరిహారం ఇప్పించేలా కృషి చేయవలసిందిగా తుమ్మలని కోరడం జరిగింది.స్వతహాగా రైతు అయిన తుమ్మల వారి ఆవేదనను అర్థం చేసుకుని సెప్టెంబర్ మూడవ తారీఖున ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనుట కొరకు ఢిల్లీ వెళ్లారు ఈ క్రమంలోనే కేంద్ర జాతీయ రహదారుల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ గిరిధర్ IASని కలిసి రైతుల సమస్యలను విన్నవించి భూములు కోల్పోతున్న రైతులకు అత్యధిక నష్టపరిహారం ఇవ్వాలని కోరారు దానికి గిరిధర్ సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అనుమతి కూడా అవసరం వుంటుంది వారి నుండి ప్రతిపాదనలు పంపించినట్లైతే దానిని యధాతథంగా ఆమోదిస్థానని హామీ ఇవ్వడం జరిగింది.

మళ్ళీ ఇదే విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి సోమేశ్ కుమార్ పోన్ చేసి రైతుల బాధలను సవివరంగా వివరించి సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇప్పించాలి అని విజ్ఞప్తి చేయటం జరిగింది. దానికి ఆయన స్పందించి ప్రతిపాదనలనాపై సంతకం చేసి కేంద్ర ప్రభుతానికి పంపించారు.మెరుగైన ప్యాకేజీ రైతుల ఖాతాలో నగదు జమ అయినా సందర్బంగా రైతులు మాజీ మంత్రి తుమ్మలను ఘనంగా సత్కరించారు.రైతుల మోమున చిరునవ్వుకు కారణమైన తుమ్మల నాగేశ్వరరావుకు జీవితాంతం రుణపడి ఉంటామని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…

- Advertisement -