సాంస్కృతిక రంగాలను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్..

35
gangula

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాంస్కృతిక రంగాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య గురువారం మంత్రి గంగుల కమలాకర్‌ను కలిశారు.ఈ సందర్భంగా మాట్లాడిన గంగుల…మొగులయ్యకు అండగా ఉంటామన్నారు

తెలంగాణ ప్రభుత్వం తనకు అందిస్తున్న సహకారానికి మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు. గతంలో ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడమే తన జీవితాన్ని మార్చిందన్నారు.

ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో తన కళను చేర్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరపున కళాకారుల ఫించను 10వేల సహాయాన్ని తమ కుటుంబానికి కల్పించినందుకు జీవితకాలం రుణపడి ఉంటానన్నారు.