ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా, సుడిగాలి పర్యటన చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహిళలు, పిల్లలు, ఇతర వర్గాల ప్రజలకు మాస్కులు, వివిధ సేవా సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో అందిస్తున్న నిత్యావసర సరుకులను నిరుపేదలకు పంపిణీ చేశారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడులో పలువురు దాతల సహకారంతో అందిస్తున్న నిత్యావసర సరుకులను నిరుపేదలకు పంపిణీ చేశారు. తొర్రూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అందిస్తున్న నిత్యావసర సరుకులను నిరుపేదలకు పంపిణీ చేశారు.
తొర్రూరులోని శారదా స్కూల్ ఆధ్వర్యంలో అందిస్తున్న నిత్యావసర సరుకులను నిరుపేదలకు పంపిణీ చేశారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో దీప డిజిటల్స్ వజినేపల్ల అనిల్ ఆధ్వర్యంలో పేపర్ బాయ్స్ కి అందిస్తున్న నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి..కరోనా లాక్ డౌన్ సమయంలో నిరుపేదలను ఆదుకోవడానికి ముందకు వచ్చిన దాతలకు అభినందనలు తెలిపారు. ఇలాంటి సమయంలోనే పేదలను ఆదుకుకోవాలి…మరికొందరు దాతలు ముందుకు రావాలన్నారు.
ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో వేలాది కుటుంబాలను ఆదుకుంటున్నానని…కష్ట కాలం వచ్చింది. ఎవరూ ఉపాసముండే పరిస్థితులు రావొద్దనేదే సిఎం కెసిఆర్ ఆలోచన అన్నారు. అందుకు తగ్గట్లుగా గ్రామాల్లోని ప్రజలే ఒకరినొకరు ఆదుకునేవిధంగా తయారు కావాలన్నారు.
ఆర్థిక నష్టాలు సంభవించినా సరే, ప్రజలందరి ప్రాణాలు కాపాడాలనే సిఎం లాక్ డౌన్ విధించారని…కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ప్రపంచమంతా హర్షిస్తుందన్నారు.