కరోనా లాక్ డౌన్ సమయంలో ఆ వైరస్ నుండి ప్రజలను కాపాడుతూనే, రైతులకు పంటలను కొనుగోలు భరోసా ఇస్తూనే, విస్తృతంగా మంత్రి తన విద్యుక్త ధర్మాన్ని నిర్వస్తున్నారు. మరోవైపు అదే లాక్ డౌన్ సమయాన్ని తన కుటుంబానికి, వ్యవసాయ, ఇంటి పారిశుద్ధ్య పనులకు సద్వినియోగం చేస్తున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో తన వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో వేసిన పంటలను చూశారు. కూలీలకు తగు సూచనలు చేశారు. అలాగే తోటలోని పండ్ల పంటలను పరిశీలించారు. ఆయా కాయలను పట్టి చూశారు.
ఈ సంర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా వైరస్ సృష్టించిన కష్టాల నుండి బయట పడడానికి లాక్ డౌన్, స్వీయ నియంత్రణే ముఖ్యమని అన్నారు. అలాగే, సామాజిక, భౌతిక దూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలతో సొంత పనులు, వ్యవసాయ పనులు చేసుకోవడంలో, చూసుకోవడంలో ఓ సంతృప్తి ఉంటుందని చెప్పారు. రైతుగా తాను ఆనందంగా గడుపుతానని అన్నారు.