మాస్టర్ ప్లాన్‌పై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష..

430
errabelli
- Advertisement -

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్‌లో మాస్టర్ ప్లాన్‌పై పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటిల్, మున్సిపల్ కమిషనర్ రవి కిరణ్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల కోసం మాస్టర్ ప్లాన్‌ రూప కల్పన జరుగుతున్నది. 2041లో మాస్టర్ ప్లాన్ తుదిదశకు చేరింది. దీనిపై ఇప్పటి వరకు 3500 మంది తమ అభిప్రాయలను తెలియపరిచారు. ఔటర్ రింగ్ రోడ్డు కలుపుకొని మాస్టర్ ప్లాన్ తయారు చేశాం.. నెల రోజుల క్రితం కొన్ని మార్పులు చేయాలని సమావేశం నిర్వహించుకున్నామని మంత్రి అన్నారు.

ఈ మాస్టర్ ప్లాన్‌లో లోపాలు ఉంటే ప్రజలు ఫిర్యాదు చేయండి అని కోరాము.. ప్రధాన లోపాలను ఈ రోజు గుర్తించి మార్పులు చేశాం.. 15 రోజు లలో మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తాం. ఈ మాస్టర్ ప్లాన్ లో 272 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులను మరమ్మతులు చేపట్టి అభివృద్ధి చేయాలని మంత్రి తెలిపారు.

వరంగల్ నగరం కాకతీయుల రాజులు పాలించిన గడ్డ.. శిఖం భూముల ప్రభుత్వం కాపాడుతుంది. దేవాలయ భూములు కొంత మంది అక్రమిచ్చు కున్నారు. జిల్లాలోని దేవాదాయ భూములకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. భూమి కోల్పోయిన వారికి న్యాయం చేస్తాం.. కేసీఆర్, కేటీఆర్ జిల్లా అభివృద్ధి కృషి కోసం ఎంతో చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -