CMKCR:న్యాయమే గెలుస్తుంది

44
- Advertisement -

ఈదేశం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆవేశంతో కాదు ఆలోచనతోనే ఈ దేశాన్ని కాపాకుందామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన చివరికి న్యాయమే గెలుస్తామని అన్నారు. ఈ దేశం గంగాజమునా తెహజీబ్‌ సంస్కృతి విశిష్టమైంది అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎల్‌బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో కేసీఆర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 9యేళ్ళ కిందట తెలంగాణ అంటే వెనుకబడిన ప్రాంతమని అనేవారు. ఇప్పుడు అభివృద్ధిలో మ‌న ద‌రిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా లేదన్నారు. త‌ల‌స‌రి ఆదాయం తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా నిలిచామని …అందుకే అన్ని రంగాల్లో దేశంలోనే అగ్ర‌గామిగా తెలంగాణ ఉందన్నారు.

మైనార్టీలకు పదేండ్లలో కాంగ్రెస్‌ ఖర్చు చేసింది కేవలం రూ.1200కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమం కోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు. తాగు, నీరు, కరెంట్‌ సమస్యలు పరిష్కరించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌, మల్లారెడ్డి, సానియా మిర్జా, ఇతర ముస్లిం మత పెద్దలతో పాటు 13వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. ముస్లిం చిన్నారులకు కేసీఆర్‌ రంజాన్‌ కానుకలు అందించారు.

ఇవి కూడా చదవండి…

మహేశ్వర్ రెడ్డి దారెటు ?

ఛాలెంజ్ చేశా.. నో రెస్పాన్స్ !

మస్క్‌ వర్సెస్ వెస్ట్రన్ కంట్రీస్‌..!

- Advertisement -