కరోనా మహమ్మారి లాక్ డౌన్ తర్వాత తొలిసారిగా వెస్టిండీస్‌తో తలపడనుంది ఇంగ్లాండ్. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్లును ప్రకటించింది ఈసీబీ. 13 మందితో కూడిన జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్….కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌ని ఎంపిక చేసింది. జూలై 8 రేపటి నుండి తొలిటెస్టు ప్రారంభంకానుంది.
ఏకైక స్పిన్నర్‌గా డోమ్ బెస్ ఎంపికచేసిన ఈసీబీ…ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఇసిబి తొమ్మిది మంది రిజర్వ్ ఆటగాళ్లను తీసుకుంది. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తనకు బిడ్డ పుట్టబోతున్న కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇక తుది జట్టులో మొయిన్ అలీకి చోటు దక్కలేదు.
ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరే బర్న్స్, జోస్ బట్లర్ (wk), జాక్ క్రాలే, జో డెన్లీ, ఆలీ పోప్, డోమ్ సిబ్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
రిజర్వ్స్: జేమ్స్ బ్రేసీ, సామ్ కుర్రాన్, బెన్ ఫోక్స్ (wk), డాన్ లారెన్స్, జాక్ లీచ్, సాకిబ్ మహమూద్, క్రెయిగ్ ఓవర్టన్, ఆలీ రాబిన్సన్, ఆలీ స్టోన్.