మరో 4 వారాలు అప్రమత్తం!

493
midatala dandu
- Advertisement -

ఓ వైపు కరోనా మరోవైపు మిడతల దండు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో నాలుగు వారాలు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఏవో) సూచించింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలకు సూచించిన ఎఫ్‌ఏవో పంటలపై మిడతల దండు దాడిచేసే అవకాశం ఉందని తెలిపింది.ఇరాన్‌, పాకిస్థాన్‌ నుంచి భారత్‌-పాక్‌ సరిహద్దుల మీదుగా ఉత్తరాది రాష్ర్టాలపై దాడి చేసేందుకు మిడుతల దండు దూసుకొచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ఇప్ప‌టికే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, బీహార్‌ రాష్ర్టాల్లో మిడతల దాడి ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పంటలపై మిడతల దాడిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం డ్రోన్లు, బెల్‌ హెలికాప్టర్ల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది.

- Advertisement -