సౌంథాప్టన్ టెస్టులో ఓడిన భారత్‌..

216
- Advertisement -

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో గొప్పగా పుంజుకుని అద్భుత విజయంతో సిరీస్‌పై ఆశలు రేకెత్తించిన భారత్‌.. తర్వాతి మ్యాచ్‌లో మళ్లీ ప్రత్యర్థికి తలవంచింది. నాలుగో రోజు, ఆదివారం ముగిసిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా 60 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఐదు టెస్ట్‌ల సీరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 3-1తో గెలుచుకుంది. నాలుగో టెస్టు మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 273 పరుగులు, రెండో ఇన్సింగ్స్ 184 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ 246 పరుగులు, రెండో ఇన్నింగ్స్ 271 పరుగులు చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

India vs England

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 246

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 273

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 271; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) స్టోక్స్‌ (బి) అండర్సన్‌ 17; రాహుల్‌ (బి) బ్రాడ్‌ 0; పుజారా ఎల్బీ (బి) అండర్సన్‌ 5; కోహ్లి (సి) కుక్‌ (బి) అలీ 58; రహానె ఎల్బీ (బి) అలీ 51; పాండ్య (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 0; పంత్‌ (సి) కుక్‌ (బి) అలీ 18; అశ్విన్‌ ఎల్బీ (బి) కరన్‌ 25; ఇషాంత్‌ ఎల్బీ (బి) స్టోక్స్‌ 0; షమి (సి) అండర్సన్‌ (బి) అలీ 8; బుమ్రా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 2

మొత్తం: (69.4 ఓవర్లలో ఆలౌట్‌) 184;

వికెట్ల పతనం: 1-4, 2-17, 3-22, 4-123, 5-127, 6-150, 7-153, 8-154, 9-163;

బౌలింగ్‌: అండర్సన్‌ 11-2-33-2; బ్రాడ్‌ 10-2-23-1; అలీ 26-3-71-4; స్టోక్స్‌ 12-3-34-2; కరన్‌ 3.4-2-1-1; రషీద్‌ 7-3-21-0

- Advertisement -