- Advertisement -
ట్విట్టర్‌ని సొంతం చేసుకున్న దగ్గరి నుండి తనదైన పాలసీతో దూసుకుపోతున్నారు సీఈవో ఎలన్ మస్క్. ఉద్యోగుల తొలగింపు దగ్గరి నుండి ఫేక్ అకౌంట్స్ పై కొరఢా ఝుళిపించడం వరకు మస్క్ తనదైన నిర్ణయాలతో సంచలనం సృష్టించారు. ఇక తర్వాత ట్విట్టర్ సీఈవోగా తొలగింపుపై నెటిజన్ల నుండి పోల్ సలహా తీసుకున్నారు. ఇందులో ఎక్కువమంది ఆయన తొలగింపుకే ఓటు వేశారు. దీంతో త్వరలో ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు మస్క్.
సీఈఓగా వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగించిన తరువాత నేను ఆ పదవి నుంచి వైదొలుగుతానని మస్క్ తెలిపారు. ఆ తర్వాత సాప్ట్‌వేర్ అండ్ సర్వర్‌ల బృందాలను నడుపుతానంటూ ట్విటర్‌లో మస్క్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -