కనెక్ట్ పై నయనతార ముచ్చట్లు

59
- Advertisement -

స్టార్ హీరోయిన్ నయనతార చేసిన హీరోయిన్ సెంట్రిక్ సినిమా కనెక్ట్. ఈ సినిమా రేపు విడుదల నేపథ్యంలో నయనతార ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి నయనతార బోలెడు విషయాలు చెప్పుకొచ్చింది. రేపు కనెక్ట్ విడుదల గురించి ఎగ్జైట్ అవుతున్నాను. కనెక్ట్… టీజర్, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ లభించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కనెక్ట్ సినిమాలో నా పాత్ర పై నేను చాలా ఎగ్జైట్ అయ్యాను అంటూ నయనతార చెప్పుకొచ్చింది. అదే సమయంలో కొంచెం నెర్వస్ కూడా ఉంది. కనెక్ట్ టీజర్, ట్రైలర్లో మేము చూపించినది నిజమే. సినిమాలో ఏం ఉందో అదే చూపించాం. కనెక్ట్ సినిమా అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని నయనతార చెప్పింది.

ఇక తన సినిమాల ఎంపిక గురించి నయనతార మాట్లాడుతూ.. సాధారణంగా నేను ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయడానికి రెండు రోజుల సమయం తీసుకుంటా. కానీ, కనెక్ట్ కథ విన్న వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేసేసిన కథల్లో కనెక్ట్ ఒకటి. కనెక్ట్ లో సుసాన్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఆ పాత్రలో నేను నటించడం ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. కనెక్ట్ సినిమా కథ విన్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని నమ్ముతున్నాను అని నయనతార చెప్పింది.

ఇంతకు మించి కనెక్ట్ కథ గురించి నేను ఇంకేమైనా చెప్పానంటే… సినిమా చూసేటప్పుడు థ్రిల్ మిస్ అవుతారు. కనెక్ట్ సినిమాని థియేటర్లో చూసేటప్పుడు తర్వాత ఏం జరుగుతుందోనని కుర్చీ అంచుకు వచ్చేస్తారు. అంత బాగుంటుంది ఈ కథ అని నయనతార చెప్పింది. మరి నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -