తగ్గేదేలే అంటున్న మస్క్‌!

162
ambani
- Advertisement -

ట్విట్టర్‌లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు సీఈవో ఎలన్ మస్క్. కంటెంట్ మాడరేషన్‌లో భాగంగా ఫేక్ అకౌంట్స్‌, ఆర్ధిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉండటంతో ఉద్యోగాల కోతపై దృష్టి సారించారు. దీంతో ఉద్యోగుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇక ఇవేమీ పట్టించుకోని మస్క్‌…రోజుకు 12 గంటల పాటు పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఏకంగా 1200 మంది ఉద్యోగులు రాజీనామా చేయగా అయినా వెనక్కి తగ్గని మస్క్‌ మరిన్ని ఉద్యోగాల కోతపై దృష్టిసారించారు. ఈసారి తొలగింపుల్లో సెల్స్ అండ్ మార్కెటింగ్, పార్ట్‌నర్‌షిప్ విభాగాల్లో కోతలు చేపట్టేందుకు మస్క్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆయా శాఖల అధిపతులకు ఇప్పటికే సమాచారం వెళ్లిందట.

ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న కొద్ది రోజులకే ఏకంగా 50 శాతం మంది ఉద్యోగులని తొలగించారు. వర్క్ ఫ్రం హోం పాలసీని కూడా రద్దు చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -