ఢిల్లీ మేయర్‌ ఎన్నిక వాయిదా…

43
- Advertisement -

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎన్నిక మరో సారి వాయిదా పడింది. సంఖ్యాబలం లేకున్నా బీజేపీ మేయర్ పదవికి పోటీ చేయడంపై ఆప్ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆప్ సభ్యులు ఒకరినొకరు తోసుకోవడం, కుర్చీలు విసురుకున్నారు. గట్టి బందోబస్తు నిర్వహించిన గొడవలకు ఆప్ బీజేపీ కౌన్సిలర్లు గొడవలకు దిగారు.

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నికల ప్రక్రియ గందరగోళం మధ్య వాయిదా పడింది. మేయర్ ఎన్నికకు ఓటింగ్ ప్రారంభం కాగానే సభలో రచ్చ మొదలైంది. దీంతో ఆప్ సభ్యులపైకి బీజేపీ కార్పోరేటర్లు దూసుకుపోగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో మేయర్ ఎన్నిక వాయిదా వేశారు.

ఇవి కూడా చదవండి…

ఈ సారి పరేడ్‌లో…మేకిన్‌ ఇండియా

దిగ్విజయ్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం..

అబ్బే అదేం లేదు :జెఫ్‌ బెజోస్‌

- Advertisement -