2022వ సంవత్సరం ముగిసింది. 2023వ సంవత్సరం ఆరంభంలోనే భారత ఎన్నికల సంఘం కీలకమైన ప్రకటనను జారీ చేసింది. ఈ యేడాది వరుసగా 9రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ పదవికాలం ముగియనుంది. తాజాగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయా, త్రిపుర రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16వ తేదీన మేఘాలయా నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న తేదీన పోలీంగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. నాగాలాండ్ మార్చి12 మేఘాలయా మార్చి15, త్రిపుర మార్చి22వ తేదీల్లో అసెంబ్లీలు ముగియనుంది.
Schedule for GE to the Legislative Assemblies of Meghalaya, Nagaland & Tripura.#AssemblyElections2023 #ECI pic.twitter.com/nZLJtADBMz
— Election Commission of India #SVEEP (@ECISVEEP) January 18, 2023
మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ నియోజకవార్గాల చొప్పున మొత్తం 180నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు సీఈసీ ప్రకటించారు. మొత్తం 9125పోలింగ్ కేంద్రాలు ఏరర్పాటు చేయనున్నట్టు పతెలిపారు. 80శాతానికి పైగా పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు అవుతున్నట్టు రాజీవ్‌కుమార్ తెలిపారు. కాగా 70శాతం పోలింగ్ కేంద్రాలకు వెబ్‌కాస్టింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీ అధికారంలో ఉంది. త్రిపురలో మాణిక్ సాహా నేతృత్వంలోని బీజేపీ ఉండగా…మేఘాలయా, నాగాలాండ్‌లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది.
ఇవి కూడా చదవండి…