దేశంలో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈసీ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ విడుదల కావడంతో దేశ వ్యాప్తంగా ఎనికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళి అనేది 1960 లో తొలిసారి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలక్షన్ టైం లో పాటించవలసిన నియమనిబంధనలను ఈసీ తప్పకుండా ప్రకటిస్తూ వస్తోంది. కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాజకీయ పార్టీలు, నేతలు కొన్ని రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. లేదంటే రాజ్యాంగానికి విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం !
* ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ప్రజలను ప్రేరేపించేలా కొత్త పథకాలను స్కీమ్ లను ప్రకటించకూడదు.
ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాజకీయ పార్టీల గుర్తులు గాని బ్యానర్లుగాని ఉంచరాదు. అలాగే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో మంత్రుల యొక్క ఫోటోస్ తీసివేయాలి.
* ప్రత్యర్థి పార్టీ నేతలపై వ్యక్తిగత విమర్శలుగాని ధూషణలు గాని చేయరాదు అలా చేయడం కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే. ఇంకా పార్టీ ప్రచారల్లో పిల్లలను పాల్గొనేలా చేయరాదు.
.*ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడూ ప్రత్యర్థి నేతలపై ఉద్దేశ్య పూర్వకంగా హింసను ప్రేరేపించేలా వ్యవహరించకూడదు.
* ఓటర్లను ప్రభావితం చేసేలా ధన ప్రలోభలకు గురి చేయడం, బెదిరించడం వంటివి చేయరాదు. ఇంకా రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టో కూడా రాజ్యాంగ బద్దంగా ఉండాలి.
* కులాల మద్య మతాల మద్య చిచ్చు పెట్టెల మాట్లాడడం కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి బహిరంగ సభలు గాని ప్రచారాలు గాని నిర్వహించరాదు.
Also Read:మోడీ – జగన్.. మధ్య వైరం?
* దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి మత సంబంధిత ప్రదేశాలలో ప్రచారాలు నిర్వహించకూడదు.
* ఇంకా రాజకీయ పార్టీల ప్రకటనలలో ప్రజాధనాన్ని ఉపయోగించకూడదు. అలాగే పార్టీ నేతలు గాని మంత్రులుగాని ప్రభుత్వ వాహనాలను ఎన్నికల ప్రచారల్లో వాడకూడదు.
ఇలా కొన్ని నియమాలను రాజకీయ పార్టీలు నేతలు తప్పని సరిగా పాటించాలి. వీటిని ఉల్లంఘిస్తే వారిపై లేదా ఆ పార్టీ పై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది.