74వ గణతంత్ర దినోత్సవంకు ఈజిప్ట్‌ నేత

72
- Advertisement -

74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకులకు ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్‌ఎల్‌సీసీ హాజరుకానున్నట్టు భారతవిదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు జనవరి 24న ఈజిప్టు అధ్యక్షుడు ఢిల్లీ చేరుకుంటారు. 25వ తేదీన ప్రధాని మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో సమావేశమవుతారు. అనంతరం అదేరోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ పూర్వకంగా ఇచ్చే విందుకు హాజరవుతారు. 26న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటారు. ఈ పరేడ్‌లో ఈజిప్ట్‌ నుంచి వచ్చిన 180 మంది సభ్యుల బృందం పాల్గొననుంది. ఈసందర్బంగా ఇరుదేశాల దౌత్య సంబంధాలకు గుర్తుగా స్మారక స్టాంపును విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి…

భారత్ వర్సెస్‌ పాకిస్థాన్@దావోస్‌

గూగుల్‌లో లేఆఫ్‌..మాంద్యమే కారణమా!

వెల్‌కమ్‌ ఏడబ్ల్యూఎస్:కేటీఆర్‌

- Advertisement -