అంబటి రాంబాబును వదలని ఈడీ!

2
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి షాక్ ఇచ్చింది. ఏపీ మద్యం రవాణా కేసులో సెప్టెంబర్ 28న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ రెండుసార్లు సమన్లు జారీ చేసినట్లు సమచారం. షెడ్యూల్ ప్రకారం శుక్రవారమే ఈడీ విచారణకు అంబటి హాజరుకావాల్సి ఉండగా తన అనారోగ్య కారణాల రీత్యా మినహాయింపు ఇవ్వాలని, విచారణకు మరొక తేదీని కేటాయించాలని ఆయన అధికారులను కోరారు. అంబటి విజ్ఞప్తిని పరిశీలించిన ఈడీ అధికారులు సెప్టెంబర్ 28న తమ ముందు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.

మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టుల కేటాయింపు, వాటి వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తంలకు కేటాయించిన సబ్‌కాంట్రాక్టుల వ్యవహారంపై అధికారులకు అనుమానాలు ఉన్నాయి. ఈ సబ్‌కాంట్రాక్టులకు సంబంధించిన లావాదేవీల్లో అంబటి రాంబాబు పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

సెప్టెంబర్ 28న జరగబోయే ఈడీ విచారణలో సబ్‌కాంట్రాక్టుల కేటాయింపులు, ఆర్థిక లావాదేవీలపై అంబటి రాంబాబును అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read:Asian Games:భారత్‌కు మరో పసిడి

- Advertisement -