నేచురల్ స్టార్ నాని, వైవిధ్యభరితమైన కథలను తెరకెక్కించే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌ను చవిచూసింది. తెలంగాణ నేపథ్యంతో పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది.
ముఖ్యంగా ఈ చిత్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిత్వం నుంచి ప్రేరణ పొంది రూపొందించిన ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాత్రలో నటుడు ప్రియదర్శి జీవించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ సినిమా విశేష ఆదరణ పొందుతున్న తరుణంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తాను ప్రత్యేకంగా థియేటర్‌కు వెళ్లి ఒక సినిమా చూడబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read:Asian Games:భారత్‌కు మరో పసిడి
నాకు ఎంతగానో ఇష్టమైన నటుల్లో ఒకరైన నాని, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఈ రాత్రి థియేటర్‌లో చూడబోతున్నాను” అని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ, చిత్రబృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”
— KTR (@KTRBRS) September 26, 2026

