పాడ్‌లలో…ఒకేసారి 30వేల శిశువులు

145
- Advertisement -

కృతిమ గర్భాధారణను సృష్టించి ప్రపంచంకు కావాల్సిన జనభాను వృద్ధి చేసుకోవచ్చని ఎక్టోలైఫ్ చీఫ్ హాషీమ్ అల్ ఘైలీ అన్నారు. ఎక్టోలైఫ్ వ్యవస్థాపకుడు ఘైలీ గత యాబై సంవత్సరాలగా కృతిమ గర్భాధారణపై పరిశోదనలు సాగించారు. ఈ సందర్భంగా ఎక్టోలైఫ్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని అలోచిస్తున్నట్టుగా తెలిపారు. దీని ద్వారా సహజ గర్భంను మనషులకు బాధ కలిగిస్తుందని మరియు సీ సెక్షన్ల్ ఎక్కువగా జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు ఈ ఎక్టో లైఫ్ ప్రణాళిక పనిచేస్తుందని తెలిపారు. 1978లో మొదటి సారిగా ఐవీఎఫ్ ద్వారా లూయిస్ బ్రౌన్ బేబీ అవతరించిన సంగతి తెలిసిందే.

కృతిమ గర్భం గురించి
ఎక్టోలైఫ్ ద్వారా ఇన్ఫెక్షన్‌ రహిత వాతావరణంలో బేబీలను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. ఇందులో ఒక భవనంలో సంవత్సరానికి 30000 పాడ్ సృష్టించవచ్చన్నారు. . ప్రతి పాడ్ లొ తల్లి గర్భాశయం లోపల ఉండే ఖచ్చితమైన పరిస్థితులను ప్రతిబింబించేలా రూపొందించబడిందని ఘైలీ చెప్పారు.

స్మార్ట్ డిజిటల్ స్క్రీన్ ఎక్టోలైఫ్‌లోని తల్లిదండ్రులు లేదా ఉద్యోగులు శిశువు యొక్క అభివృద్ధి పురోగతిపై ప్రతిరోజు డేటాను చూడటానికి వీలుగా ఉంటుందని తెలిపారు. బేబీ యొక్క పరిస్థితులను ఫోన్ యాప్ ద్వారా కూడా డేటాను చూసుకోవచ్చన్నారు. పాడ్‌లపై ఉన్న సెన్సార్‌లు శిశువు యొక్క ముఖ్యమైన సంకేతాలను పర్యవేక్షించగలవు మరియు హృదయ స్పందన, ఉష్ణోగ్రత, రక్తపోటు, శ్వాస రేటు మరియు ఆక్సిజన్ సంతృప్తతతో సహా వాటిని తెరపై ప్రదర్శించగలిగేలా చేయవచ్చని తెలిపారు.

పాడ్‌లో ఒక అంతర్గత స్పీకర్‌ ద్వారా పుట్టబోయే పిల్లలకు ఏవిధమైన శబ్దాలను వినిపించుకునేలా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఇందులో తల్లిదండ్రులు కోరుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెటప్‌తో జన్యుపరమైన అసాధారణ పరిస్థితులను గుర్తించి వాటిని నివారించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. అన్నట్టు మీ బేబీలను ఎప్పుడైన సరే శిశువు పూర్తి కాలం నిండితే, తల్లిదండ్రులు కోరుకున్నప్పుడల్లా కేవలం ఒక్క బటన్ నొక్కడం ద్వారా జనన ప్రక్రియను పూర్తిచేయవచ్చని ఎక్టోలైఫ్‌ చీఫ్ ఘైలీ వివరించారు.

భవిష్యత్‌ ప్రపంచం కోసమని ఇందులో మనకు కావాల్సిన విధంగా మార్పులు చేసుకోవచ్చని తెలిపారు. బేబీ యొక్క ఎత్తు రంగు జన్యు పరమైన విధానం లాంటివన్ని కూడా నిర్ధారించుకోవచ్చని ఘైలీ వివరించారు. అయితే Metro.co.ukఅనే నివేదిక ప్రకారం పోల్‌ నిర్వహించగా సూమారుగా 80 శాతం మంది స్త్రీలు దీన్ని వ్యతిరేకించారు. ప్రకృతికి వ్యతిరేకంగా ఇలాంటి చర్యలను ప్రోత్సహించకుడదని వివరించింది. ఒకవేళ ఇది విజయవంతమైతే ప్రపంచంలో మనకు కావాల్సిన వ్యక్తులను మనమే నేరుగా తయారుచేసుకోవచ్చని తెలిపింది.

ఇవి కూడా చదవండి…

దేశంలోనే కాస్ట్లీ కారు..హైదరాబాద్‌లో

టీ లేదా కాఫీ తరచూ తాగుతున్నారా ?

విషాదం: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య !

- Advertisement -