కన్నీళ్లు పెట్టుకున్నా వదల్లేదు

60
- Advertisement -

హీరోయిన్ అమలా పాల్ కి నాయక్ సినిమా తర్వాత బబ్లీ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె డేట్లు కోసం అప్పట్లో చాలామంది దర్శక నిర్మాతలు అమలాపాల్ చుట్టూ తిరిగారు. అయితే, ఇక్కడే పొరపాటు చేసింది అమలాపాల్. ఆ సమయంలో తనకొచ్చిన స్టార్ డమ్ ని క్యాష్ చేసుకోకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి కాస్త పెటాకులు అయ్యాయి. అనంతరం మళ్లీ ఛాన్స్ ల కోసం పరితపించింది. హీరోయిన్ గా మళ్లీ ఓ ఊపు ఊపేయాలని ఉబలాట పడింది.

కానీ, అమలాపాల్ కి ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు. ఇక చేసేదేం లేక, వచ్చిన ప్రతి చిన్నాచితకా సినిమా ఒప్పేసుకుని బ్యాంక్ బ్యాలెన్స్ ను ఫుల్ గా నింపేసుకునే పనిలో పడింది. కానీ.. సినిమాల ఎంపికలో అమలాపాల్ కు క్లారిటీ లేదు. ఆమె తెలియనితనాని  ఓ నిర్మాత తనకు అనుకూలంగా వాడుకోవాలని చూశాడు. దాంతో అమలాపాల్ బాగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఓ కోలీవుడ్ ప్రొడ్యూసర్ అమలాపాల్ ను బాగా ఇబ్బంది పెట్టాడు.

అమలాపాల్ సోలో హీరోయిన్‌గా మొదలైన ఆ సినిమా షూటింగ్ సగం పూర్తి అయ్యాక, ఓ రొమాంటిక్ సీన్ కోసం బెడ్ సీన్స్ చేయాలని అమలాపాల్ ను బలవంతం చేశాడట సదరు నిర్మాత. అమలాపాల్ వద్దు అని కన్నీళ్లు పెట్టుకున్నా ఆ నిర్మాత వదలలేదట. చివరకు అమలాపాల్ చేత ఆ బోల్డ్ సీన్స్ చేయించారట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అమలాపాల్ ఇదే విషయాన్ని బాధ పడుతూ చెప్పింది.

ఇవి కూడా చదవండి…

షారుఖ్‌కు షాక్‌…పఠాన్ బ్యాన్‌ నిజమెంత

వాల్తేరు వీరయ్య రన్ టైమ్ ఎంతంటే ?

టాప్ టెన్‌ ఐఎండీబీ మూవీస్‌…

- Advertisement -