అన్నార్తులు ఆకలి తీర్చిన ఐవీఎఫ్..

455
Uppala Srinivas Gupta
- Advertisement -

కరోనా మహమ్మారి విజృంభణతో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి ఈ నేపథ్యంలో అన్ని రంగాలు మూతపడ్డాయి. అలాగే దేవాలయాలు కూడా మూసివేయడం జరిగింది. ఈ క్రమంలో గత రెండు నెలలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పూజారులు, దేవాలయాల సిబ్బంది ధూప దీప నైవేద్యాలు కొనసాగిస్తున్నారు. ప్రజలంతా సుభిక్షింగా ఉండాలని పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఉప్పల ఫౌండేషన్ తరపున వారికి బాసటగా నిలిచారు. దిలీసుఖ్ నగర్‌లోని సాయిబాబా దేవాలయంలోని పూజారులకు, బ్రాహ్మణులకు,ఆలయ సిబ్బందికి బత్తాయి పండ్లు, బిర్యానీ ప్యాకెట్లు, మాస్కులు, బియ్యం, కందిపప్పు, మంచినూనె, పసుపు, ఉప్పు కారం వంటి నిత్యావసరాలు అందించారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం కోసం శ్రమిస్తున్న అయ్యవారికి, సిబ్బందికి సహాయం చేయటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనన్న కుటుంబ సభ్యులు ఉప్పల స్వప్నమ్మ, సాయితేజ, సాయి కిరణ్ మరియు ఆలయ చైర్మన్ బచ్ఛు గంగాధర్, ట్రస్ట్ మెంబర్, టీఆరెస్ నాయకుడు కూర నరసింహులు గుప్త, కేసీఆర్ ఆర్మీ ఆర్గనైజర్ సాయి యాదవ్, అనిల్ కుమార్, అనిల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు 69వరోకు ఉప్పల ఫౌండేషన్ 2వేలమందికి అన్నదానం కార్యక్రమం చేరుకుంది.ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు లాక్ డౌన్‌లో రెక్కాడితే గానీ డొక్కాడని పేదలకు, పనులు లేక, పైసలు లేక పస్తులు ఉంటున్న పేదలకు గత 69 రోజులుగా నిత్యం 2వేలమందికి అన్నదానం చేయటం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఐవీఎఫ్ తరపున 5లక్షలమందికి ఆయా జిల్లాల్లోని జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్నదానం చేయటం జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు బత్తాయి పండ్లు, కొన్ని సందర్భాల్లో శానిటైజర్, మాస్కులు అందజేశారు.

ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలోని మనుసురాబాద్, కొత్తపేట్, ఉప్పల్, నాగోల్, జయపురి కాలనీ, హయత్ నగర్, ఫిలిం నగర్, వనస్థలిపురం, దిల్ సుఖ్ నగర్ తోపాటు నాగోల్ లోని శ్రీనన్న నివాసం వద్ద మొత్తం 2 వేలమందికి బిర్యానీ ప్యాకెట్లు పంచారు. అలాగే వనస్థలిపురంలోని కరుణ జ్యోతి ట్రస్ట్‌కు, నాగోల్ లోని వాత్సల్యం ఆర్గనైజేషన్‌కు, మనుసురాబాద్ లోని సద్గురు ఓల్డేజ్ హోంలకు భోజనాలు, మాస్కులు, అందించారు. ఈ కార్యక్రమాల్లో ఐవీఎఫ్ నాయకులు, టీఆరెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -