జీహెచ్ఎంసీ ఓటర్లు, నగర వాసులకు విజ్ఞప్తి: ఈసీ

167
ec
- Advertisement -

జీహెచ్ఎంసీ ఓటర్లు, భాగ్యనగర వాసులకు విజ్ఞప్తి ..ఓటు మన హక్కు మాత్రమే కాదు.. బాధ్యత కూడా రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సరైన నాయకుడిని ఎన్నుకోండి అంటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థ సారథి విజ్ఞప్తి చేశారు. కులమతాలకు అతీతంగా సమాజ అభివృద్ధికి ఓటేయండి. జిహెచ్ఎంసి ఎన్నికలలో ఓటువేసి వార్డుల అభివృద్ధికి బాటలు వేయండి అన్నారు. యువత, విద్యాధికులు తప్పనిసరిగా ఓటింగులో పాల్గొని ఓటింగ్ శాతం పెంచండి. కోవిడ్ పేషంట్ లు, వికలాంగులు, 80 ఏండ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాం, వినియోగించుకొని ఓటేయండి అని ఈసీ కోరారు.

వికలాంగులు, వయోధికులకు పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు, ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేసాం ఉపయోగించుకొని ఓటేయాలి. వృద్ధులు, పసి పిల్లల తల్లులు, వికలాంగులు క్యూలైన్ తో సంబంధం లేకుండా నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.పోలింగ్ కేంద్రాలలో కోవిడ్ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం, నిర్భయంగా ఓటు వేయండి. డిసెంబర్ 1వ తేది ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంచాలని ఈసీ తెలిపారు.

- Advertisement -