- Advertisement -
మున్సిపల్ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పురపాలక శాఖ ఎండీ శ్రీదేవి పాల్గోన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షలో అధికారులతో చర్చించారు. మున్పిపల్ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.
పెరిగిన ఓటర్ల నేపథ్యంలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ఈసీ నాగిరెడ్డి చెప్పారు. మొత్తం సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ఉంటుంది. అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ తరువాతనే బ్యాలెట్ పేపర్ లు ప్రింటింగ్ కు ఇస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలతో రేపు ఉదయం 11.30 గంటలకు సమావేశం కానున్నట్లు చెప్పారు.
- Advertisement -