ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా అంజనీ కుమార్‌

44
- Advertisement -

తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఇంఛార్జ్‌ డీజీపీగా అంజనీకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అంజనీ కుమార్‌ ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు. కాగా ఇక నుంచి రవిగుప్తాను ఏసీబీ డీజీగా మరియు విజిలెన్స్‌ డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న మహేశ్‌భగవత్‌ను సీఐడీ అడిషనల్ డీజీగా నియామకం అయ్యారు. ఇక నుంచి రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా డీఎస్‌ చౌహాన్‌ను నియమించారు. హోంశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా డీజీ జితేంద‌ర్, లా అండ్ ఆర్డ‌ర్ అద‌న‌పు డీజీగా సంజ‌య్ కుమార్ జైన్ నియామ‌కం అయ్యారు.

ఇవి కూడా చదవండి…

స్టే ఇవ్వండి..హైకోర్టుకు సునీల్ కనుగోలు

అత్యంత పొడవైన స్కైవాక్ ఎక్కడంటే…

ఘనంగా అనంత్ అంబానీ – రాధిక ఎంగేజ్‌మెంట్

- Advertisement -