నేరుగా అకౌంట్లోకి రైతు బంధు సాయం..

450
- Advertisement -

రైతు బంధు పథకానికి అడ్డంకులన్ని తొలగిపోయాయి. రైతులకు పెట్టుబడి సాయం చేసే రైతు బంధు పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. రైతులకు చెక్కులు కాకుండా నేరుగా అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని సూచించింది ఎన్నికల సంఘం.

మొదటిసారి రైతుబంధు చెక్ అందుకున్న రైతులకు మాత్రమే రెండో దఫా చెక్కుల పంపిణీని చేయాలని సూచించింది. ఈ పథకం ఇప్పటికే అమలులో ఉన్నందున… కోడ్ వర్తించదని క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

ఇప్పటికే జిల్లాలకు చేరిన చెక్కులను వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు పంపిణీ చేయవద్దని సూచించింది. నేరుగా రైతుల ఖాతాల్లోకే పంటసాయాన్ని జమచేయాలని తెలిపింది. రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.4వేల చొప్పున సంవత్సరానికి రైతులకు రూ.8 వేలు ఇవ్వనుంది. తొలి దఫాలో ఎకరాకు 4వేలు ఇచ్చిన ప్రభుత్వం, రెండో దఫాలో ఎకరాకు రూ.4వేలు అందజేయనుంది.

- Advertisement -